అమ్మ! అర్ధాంతరంగా వెళ్ళిపోయింది.
ఆ పిల్లలు అసంపూర్ణ కావ్యాలు, సగం చెక్కిన శిల్పాలు.
మరి నాన్నో? సీతను కోల్పోయిన రాముడు, సతీ దేవి లేని శివుడు, వేదాలు లేని విరించి.
నిన్నటి వరకు చంటివాడినే! ఇప్పుడు ఒక్కరోజులో ముప్ఫయి ఏడేళ్ల పెద్దరికం వచ్చిన నా ...
నిన్నటి వరకు చంటివాడినే! ఇప్పుడు ఒక్కరోజులో ముప్ఫయి ఏడేళ్ల పెద్దరికం వచ్చిన నా ...
చిన్న చిన్న విజయాల్ని చూసి గర్వపడేదెవరు?
కడుపు చూడకుండానే అన్నం పెట్టేదెవరు?
కార్య సాధనకి ప్రేరణ ఎవరు?
పఠనానికి శ్రోత ఎవరు?
పిచ్చి మాటలు ఓపిక గా ఊ కొట్టేదెవరు?
పుట్టినరోజునాడు నలుగు పెట్టేదెవరు ?
చిన్నదనం నాకు మరల ఇచ్చేదెవరు?
కడుపు చూడకుండానే అన్నం పెట్టేదెవరు?
కార్య సాధనకి ప్రేరణ ఎవరు?
పఠనానికి శ్రోత ఎవరు?
పిచ్చి మాటలు ఓపిక గా ఊ కొట్టేదెవరు?
పుట్టినరోజునాడు నలుగు పెట్టేదెవరు ?
చిన్నదనం నాకు మరల ఇచ్చేదెవరు?
"అమ్మా!" అని పిలిస్తే ఇంక పలికేదెవరు?
నా ఏడుపు నాకే వినబడడం లేదు. ఇది అరణ్య రోదన. చుట్టూ ఇందరు ఉన్నా నా పిలుపుకి బదులు రాదు. అది ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. నిశబ్ద రోదన అంటే ఇదే నేమో. శూన్యం లో శబ్దం ఉండదు.
నా గురువు, దిశానిర్దేశం, ప్రేరణ, ఉత్తేజం, స్వాంతన, శాంతి , సాంప్రదాయం,
సంస్కారం, భక్తి , భయం, బాల్యం, ఆనందం, నేనైన నేను - నా అమ్మ. అమ్మ వెళ్ళిపోయింది. శూన్యం మిగిలింది.
No comments:
Post a Comment