Wednesday, December 29, 2010

నిన్నటి రాత్రి ...


నిన్నటి రాత్రి ...
నత్త పరుగు లా,
ముసలి నడకలా,
సాగింది.

నిన్నటి రాత్రి ...
చలి వల్ల
చీకటి దుప్పటి కప్పుకొని,
కీళ్ళు అరిగినట్టు కదిలింది.

నిన్నటి రాత్రి ...
అశ్రుత్వ గాంధర్వం కోసం,
కళల వెలుతురు మెరుపు లో,
నిశీధి లో వెతికాను.

Tuesday, December 28, 2010

వంశీ కతలు - 300/c, Wireless కాలనీ

ఈ అడ్రస్ ని మరిచి పోలేను. A dream house of my childhood that used to happen on every school vacation. రైల్వే రైలింగ్స్ తో చేసిన చిన్న గేటు, ఇంటి ముందు తోట, ఇల్లు, వెనక పెరడు, ఆ పెరటి ని ఆనుకొని మళ్ళీ తోట, ఇంటికి ఆనుకొని ఉన్న పని వాళ్ళ పాక. ఇంటి ముందు కుంకుడు, గన్నేరు , చింత, జామ చెట్లు. వెనక తోట లో రకరకాల పూల చెట్లు. పెరటిని ఆనుకొని ఉండే ఒక పెద్ద జామ చెట్టు. ఇంట్లో గంభీరంగా పెద్దనాన్నగారు. ఆప్యాయతతో పిలిచే దొడ్డమ్మ. పెద్దరికం తో శాంతి అక్క. చూడటానికి పెద్ద టీవీ, చదవటానికి పుస్తకాలు, భక్తిగా పూజ గది, ఇంకా సూపర్ హీరో మోహన్ అన్నయ్య.

స్కూల్ సెలవల్లో మకాం ఆ ఇంట్లోనే. సెలవలు అంటే ఈ రోజుల్లాగా వారం రోజులు కాదు, కనీసం ఒక పది, పదిహేను రోజులు ఉండేవి. నాకు స్కూల్ కి సెలవలు ఉన్నా, అన్నయ్య కి లేక పొతే వాడితో వాళ్ళ స్కూల్ కి వెళ్లి పోయేవాడిని. ఆగష్టు పదిహేను, జనవరి ఇరవై ఆరు వస్తే ఇంక రైల్వే స్కూల్ ని, రైల్వే ఆఫీసుస్ ని చుట్ట పెట్టేసే వాళ్ళం వాళ్ళు పంచే స్వీట్స్ కోసం. సింహాచలం గురు పూజలకి వెళ్ళటం ఇంకా గుర్తే అన్నయ్య వాళ్ళ మామ్మగారి తో. హనుమాన్ చాలీసా ఆ ఇంట్లో వంట పట్టిందే. రామాలయం అంటే అంట ఇష్టం అక్కడే మొదలు అయ్యింది ఏమో. ఇంకా వినాయక చవితి కి పందిళ్ళు వెయ్యటం, కరెంటు decorations . Bulb కి tubelite starter తగిలించి, అది ఆన్/ఆఫ్ అయ్యేలా చెయ్యటం, ఇలాంటి చాలా gimmicks చేసేవాడు.


మోహన్ అన్నయ్య కి, నాకు ఆ జామ చెట్టు మీదనే రోజూ కాలక్షేపం. అది కాకపొతే 'బిజినెస్' ఆడటం. బోర్ కొడితే parachute సీసాల తో football . సాయంత్రం కొలాయి తో నీళ్ళు పట్టడం, మొక్కలకి నీళ్ళు పెట్టడం. అన్నయ్య వేసే బొమ్మలు చూడటం. లేకపోతె వాడు క్రికెట్ ఆడటానికి వెళ్తే, అది చూడటానికి వెళ్ళటం. టీవీలు, సినిమాలు పెద్దగా మన జీవితాల్లోకి రాలేదు అప్పటికి. వాడు మా ఇంటికి వస్తే మాత్రం, మా ఇద్దరినీ కూర్చో పెట్టి డాడీ ఇంగ్లీష్ grammer చెప్పేవారు, బ్లాకు బోర్డు మీద రాసి. అప్పుడే కదా నాకు myopia ఉంది అని తెలిసింది. సెవెంత్ క్లాసు పబ్లిక్ పరిక్షల తరవాత నేను ఒక్కడినే చారాల టీ షర్టు వేసుకొని అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. నేను ఒక్కడినే బయటికి వెళ్ళటం అదే మొదటి సారి. పెద్దనాన్న ఏమో కంగారు పడ్డారు, నేను ఇంట్లో చెప్పి వచ్చానో లేదో అని. :) పాపం ఒక్కసారి నాకు చాలా జ్వరం వస్తే పెద్దనాన్న గారే మా ఇంటికి నన్ను దిగపెట్టారు, గిరి బావ తో కలిసి.

అన్నయ్య కి ఇంటర్ తరవాత Airforce లో జాబు రావటం, వాడు బెంగుళూరు వెళ్ళిపోవటం, నేను ఇంటర్, స్టుపిడ్ CET లో బిజీ అవ్వటం. శాంతి అక్క పెళ్లి. అన్నయ్య కి పెళ్లి కుదరటం. వాడి ఒడుగు. NAD జంక్షన్ టెలిఫోన్ బూత్ నుండి అన్నయ్య బయటకి రావటం కోసం గంటలు గంటలు వెయిటింగ్. ;) అన్నయ్య పెళ్లి, నా ఉద్యోగం. వాడి పిల్లలు. ఊపిరి సలపని పనులతో కాలం వెళ్ళిపోతోంది. ఒక్కో సారి అనిపిస్తుంది మళ్ళీ ఆ వైర్లెస్ కాలనీ రోజులు వస్తే బాగుటుంది అని.

మోహన్ అన్నయ్య ఇప్పుడు AF లోనే ఉన్నాడు. పెళ్లి ఐన తరవాత MCA పూర్తీ చేసి, ఇప్పుడు MBA గురి పెట్టాడు. వాడు చిన్నప్పుడు, ఇప్పుడు కూడా నాకు superhero నే.

హేమంత శిధిల పత్రాల మధ్య నిలుచొని, నాటి వాసంత మలయ సమీరాలని తలుచు కుంటూ ...
వంశీ

Monday, November 8, 2010

వంశీ కతలు - చీమ చింతకాయల కధ

చిన్నప్పటి ఆటలు, తిరిగిన చోట్లు, చేసిన అల్లరి, ఆట పట్టించే అన్నలు, ఆడమనే చెల్లెళ్ళు, సినిమాలు చూపే బావలు, మూతి ముడుచుకునే మరదళ్ళు, హై స్కూల్ వేషాలు, కాలేజీ విశేషాలు ... జీవితపు పరుగు పందెం లో వీటిని మనం ఎక్కడో జ్ఞాపకాల పొరల్లోకి వదిలేస్తాం. అక్కడ నుండి అవి ఏమవుతాయో, ఎక్కడికి వెళ్లి పోతాయో తెలీదు. అలాంటి నా జ్ఞాపకాలు ఈ తుది లేని పరుగు లో ఎక్కడో మరుగున పడిపోక ముందే, వాటిని సుతారంగా మీటే ప్రయత్నం ఇది.


ఇక్కడ సంవత్సరాల ప్రసక్తి లేదు, ఎందుకంటె అవి నాకు గుర్తు లేవు కనుక. మనుషుల జాబితా కూడా అంత సరి అయినది కాదు. ఈ పరుగు అప్పుడే నా మీద ప్రభావం చూపెడుతోంది మరి. గుర్తున్నంత లో రాస్తా, ఉన్నంత లో చదవండి మరి. అచ్చు తప్పులు ఉంటె కూసంత పెద్ద మనసు చేసుకొని సర్దుకుపొండి.
-- -- -- --
౧౯౮౦ల లో ఏదో ఒక సంవత్సరం. వేసవి సెలవలు. రైల్వే లో పని చేసే చిన్నప్ప మావయ్య ఇంటికి మోహన్ అన్నయ్య, శాంతి అక్క, లత అక్క, రఘు అన్నయ్య, శాంతి (అమ్మలు) దొడ్డమ్మ, శ్రీధర్ దొడ్డమ్మ, అమ్మ, నేను. ఈ గుంపు అంటా పోలో మంటూ ఏదో ట్రైన్ పట్టుకొని బయల్దేరాం. తీరా చూస్తె పిల్లల్లో నాకు, రఘు అన్నయ్య కి టికెట్లు కొనలేదు. మిగిలిన వాళ్ళు అందరు రైల్వే వాళ్ళు మరి. టికెట్ కలెక్టర్ వస్తున్నాడు అంటే మా ఇద్దరి మీదా దుప్పట్లు కప్పి, వాటి ముందు కూర్చుంది పోయారు, 'వాడు వెళ్ళినంత వరకు' కదలకంటి అని caution order వేస్తూ. అస్సలే వేసవి కాలం, అందులో, ఇనుప బెర్తులు కావటం తో ఓపిక పట్టలేని రఘు అన్న 'వాడు వెళ్ళిపోయాడా' అని అరిచాడు. 'లేదు బాబు. ఇక్కడే ఉన్నాను. బయటకి రా' అన్నాడు టికెట్ కలెక్టర్. అమ్మ వాళ్ళు TT కి నచ్చ చెప్పి, రైల్వే పేర్లు చెప్పి పంపించేసారు. ఎప్పటికో titlagarh చేరాం.

గిరి బావ, దేవి అక్క (వొదినలని అక్క అనటం, దొడ్డమ్మ ల ని వాళ్ళ పిల్లల పేర్లు పెట్టి పిలవటం నేనే మొదలు పెట్టాను), కుమారి అత్తా, చిన్నప్ప మావయ్య. రైల్వే quarter . బొగ్గుల పొయ్యి. ఇంటి ముందు పెద్ద పెరడు, బత్తాయి చెట్లు, ఏదో జిగురు చెట్టు. ఇంటి లోగిలి లో పెద్ద నీళ్ళ గోలెం. ఇంట్లో కోహినూర్ టేబుల్ ఫ్యాన్. కర్బుజ పళ్ళు. వేడిని ఫిల్టర్ చేస్తూనే, వేడెక్కించే ఇంటి మీద రేకులు. కొంచం దూరం నడిస్తే కనిపించే రైలు పట్టాలు. వాటిని ఆనుకుని ఉన్న మావయ్య కాబిన్. దాని పక్కనే రైల్వే timber . క్లుప్తంగా ఇది నాకు గుర్తున్న ఇల్లు.

గిరి బావ దగ్గర భూతద్దం, కొన్ని కత్తిరించిన సినిమా ఫిలిం ముక్కలు ఉండేవి. కిటికీ కన్నం నుండి గది లోకి పడుతున్న వెలుతురూ ని ఈ భూతద్దం మీద పడేలా చేసి, ఆ ఫిలిం ముక్కలతో మాకు అందరికి 'సినిమా' వేసే వాడు. మధ్య మధ్య లో తెల్ల గౌన్ వేసుకొని ఉన్న నిర్మా పాప కవరు, lifeboy సబ్బు కవరు ఇంటర్వల్ లో పడేవి. అది అయ్యే టప్పటికి, మావయ్య డ్యూటీ నుండి వస్తు తెచ్చిన మామిడి పళ్ళు, నీళ్ళ గోలెం లో వేస్తె, ఎవరికి ఇష్టం వచ్చి నట్టు వాళ్ళు వాటిని తినే వాళ్ళం, పెరటిలో ఉన్న చెట్ల కింద. చీకటి పడితే మాత్రం మమ్మల్నిబయటకి వేల్లనిచ్చే వాళ్ళు కాదు, చేతబడి, చిల్లంగి భయాల తో. ఒరిస్సా అంటే ఇవే అన్న stamp పడింది అప్పుడే. దేవి అక్క దగ్గర ఒక పడవ బొమ్మ ఉండేది. అందులో చిన్న దీపం పెడితే నీట్లో దాని అంతటదే నడిచేది.ఒక్క మూడు రోజులకి, నాకు సెగగడ్డలు వేసాయి మొహం మీద, మితిమీరిన మామిడిపళ్ళు, ఎండ వేడి వల్లా.

ఒక రోజు, చూసిన సినిమా నే ఎన్ని సార్లు చూస్తాం అనుకున్నారు ఏమో, పెద్ద పిల్లలు (అంటే నేను తప్ప అందరు) మధ్యానం బయటకి వెళ్దాం అనుకున్నారు. గిరి బావ స్కూల్ దగ్గర చీమ చింతకాయల చెట్టు ఉంది, ఆ కాయలు బాగుంటాయి అని చెబితే, అందరూ అక్కడికి వెళ్లాం. యెంత సేపు ఉన్నామో తెలీదు కాని, ఆ చీమ చింతకాయలు మాత్రం బాగానే పోగువేసాం. వస్తునప్పుడు నన్ను శాంతి అక్క ఎత్తుకున్నట్టు గుర్తు మరి. ఈ లోపు ఇంట్లో పిల్లలు ఎక్కడి కి వెళ్ళారో తెలీని పెద్దలు, గాభారా పది వెతకటం మొదలు పెట్టారు. ఒక రెండు గంటలు పోయిన తరవాత వస్తున్న గుంపుని చూసి, మమ్మల్ని ఇంట్లో కి రానిచ్చి, చింతకాయలు తీసుకొని అందరికి ఒక్కటే బాదుడు. పరిగెత్తించి కొట్టటం, తోలు వలిచేయ్యటం అంటే అదేనేమో. సుబ్బరంగా తన్నులు తిన్నమేము అందరం పడుకుంది పోయాం. సాయంత్రం లేచి చూసే సరికి, చింతకాయలు వలచు కుంటూ, తింటూ కనిపించారు పెద్దవాళ్ళు ఆ చెట్ల కింద. దెబ్బలు మాకు. తెచ్చిన చింతకాయలు వాళ్లకి.

అలా టిట్లాగర్హ్ దగ్గర మొదలు పెట్టి , డొంకినవలస, సిగడాం , నెల్లి మర్ల - అలా చిన్నప్ప మావయ్య ఏ ఊరికి ట్రాన్స్ఫర్ కి వెళ్తే ప్రతీ వేసవి సెలవలకి నేను, చెల్లి, మోహన్ అన్నయ్య  .. అందరం చేరిపోయే వాళ్ళం. ప్రతీ ఊరి లో ఎదో ఒక  అడ్వెంచర్ . నెల్లిమర్ల లో ఐతే ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కరెంటు ఉండేది కాదు.. అయినా రోజులు హాయి గా గడిచిపోయేవి. దేవి అక్క ఫంక్షన్ కి గిరి బావ, నేను , మోహన్ అన్నయ్య ఉదయాన్నే పాల కోసం చుట్టూ పక్కల పల్లెటూర్లు అన్నీ చుట్టుముట్టేసాం.

మోహన్ అన్నయ్య ఐరిఫోర్స్ నుండి రిటైర్ అయ్యి, Qatar  మెట్రో లో పని చేస్తున్నాడు. గిరి బావ నారాయణ స్కూల్ లో ఉన్నాడు. శాంతి అక్క ఇప్పుడు టీచర్, B Ed చేసింది.

అమెరికా కి వచ్చే ముందు ఇంట్లో బయల్దేరుతున్నాను అనగా మూర్తి అంకుల్ తెచ్చారు ఈ చీమ చింతకాయల్ని. కనిపించిన వాటిని, పలకరిస్తూ మళ్ళీ ఒరిస్సాకి బయల్దేరాను, Circle is complete అనుకుంటూ.

Friday, October 15, 2010

బయట, లోపల

తారలు తరలి పోయే,

మేఘాలు మరలి పోయే,
చందురుడు కరిగి పోయే,
సూరీడు రాక పోయే...
చీకటి ఒక్కటే మిగిలిపోయే


బయట, లోపల.

కవి. రవి

ఇలా అర్థం పర్థం లేనివి రాస్తే బాగుంటిందిలే కవి!

కాకపొతే అవి నవ్వుకోవటం వరకే రా రవి!

To My Friend . Ravi (Shankar)

వేళ. గోల

తామరలు వికసించిన వేళ

వెన్నెల వర్షించిన వేళ
మది లో హర్ష హేళ,
ప్రకృతి ఆనంద లీల.
ఎవడో వేసాడు ఈల,


అబ్బబ్బా ఏంటీ వంశీ నీ గోల !!!

ఇల . కల

మొన్న వచ్చిన కలలో

నిన్నను చూడను.
రేపటిని నిన్నటి కలలో కనను.
మరి నేటి కథ ఏమిటో
ఇలలో నేడు జీవించి చేప్పేను.

లీ ళీ

పెన్నుకి పాళీ

తినడానికి థాలి
నిద్ర కి లాలి
కామెడీ కి సుర్మా భూపాలీ
పాతాల భైరవి లో కపాలి
కి వాడి గురువు నేపాలీ
అవసరమురా ఆలీ!

అంటే తంతా !

తూరుపున సూరీడు సుర్రు మంటేను
పక్క లో నా cellu తిర్రు మంటేను
కళ్ళు ఇప్పి చూస్తె జివ్వు మంటేను
ఆఫీసు కి వెళ్ళను అని ఒళ్ళు అంటేను...
- -
రోజు ఇలా అనిపిస్తే పెద్ద తంటేను
మళ్ళీ ఇలా రాస్తే తంతాను.

Tuesday, August 10, 2010

నాలో నేను

ఎవరి హడావిడిలో వాళ్ళు,
నా తీరిక లో నేను.

ఎవరి బాధల్లో వాళ్ళు
నా ఆనందం లో నేను.

ఎవరి ఆలోచనల్లో వాళ్ళు
అస్సలు ఆలోచన లేని నేను!

నాతో నేను ఓడిపోయి
నాలో నేను గెలిచి
నాలో నేను రగిలి
నా నీడ తోనే అలిగి,
పగిలి,
నాలో నేను
కేవలం నేను గానే మిగిలి...

Sunday, July 11, 2010

In God is our trust

For reasons whatever I failed to understand the Kashmir issue in India which is burning ever since that fateful day in year 1947 and the tensions running between both the countries for the last sixty + years. Ok. I can over look that as just a brotherly feud - if I forget all about the attacks and wars in Kashmir and other areas in India remotely related with Pakistan. 
And I have the same views regarding the attacks on Iraq and Afghanistan. No war is justified; it's all just selfish. No matter who wins in the war, the loser is always the common man. Ask him in Iraq, Afghanistan, India, Pakistan, US, UK, Bangladesh, Israel, Palestine and each one them will have the same question as answer. 'Is this war just? What did I gain?'


The old man stood near the two graves - alone with tears in his eyes and his two sons buried six feet under those graves. Dead fighting for something they couldn't identify; neither could their officers or theirs or theirs.
He spent a mournful hour at those graves as the entire town gathered in the town park. He came out of the yard. The traffic dropped to a dribble and a family passed before him in a car, with two children waving the flag from the car's windows. Future is alive, playful and childish, he thought. 


The lines were being sung over the radio floated in the air...


'Then conquer we must, when our cause, it is just,
And this be our motto: "In God is our trust"
And the star-spangled banner in truimph shall wave
O'ver the land of free and the home of the brave'


The first line always intrigued the old man; when he fought in WW II and when his sons were out there fighting in Iraq and Afghanistan. 'Is the cause just?' He questioned but failed to decipher the responses he received. Only one who can safeguard mankind's future - 'God'. As he dozed off to sleep in his condo and his dog piled up in front of the half-lit fireplace, the fireworks lit up the night sky on July 4th. 

Friday, April 23, 2010

Destiny written on a paper

For the first time since the last three years, summer nights are not being so cruel with me. Seems insomnia has finally taken leave from me, leaving me in sleep for most of the days. Is it the new place, new people, new climate or all these? I don't know but given a chance I will say it is the climate and the daily walk that I 'had' to take to reach office & home.


Routine
I wake up at 6:00 or 6:30 in the morning. Take an hour to get ready, all dressed up. Microwave some milk and have corn flakes for breakfast. Run ahead to the bus stop for 8:17 bus 253. Once out of apartment block, cold wind brushes my face forcing hands into my jacket pockets. If I am lucky enough, there might also be a 'Good morning wish' from rain. Once in the bus, I catch 40 winks to get down at Bear Creek at around 9:00 am from where it's a 10 min walk to office.

It's lunch at 12:30 PM and the best part is I don't know what eatable item I am going to get in the cafeteria. It can be a pizza or thai fried rice or bucca burger or continental salad.

Coffee break at around 4:00 PM. Start to home at 6:30, to catch the 6:52 PM bus. Another 10 mins walk in the chilly wind with either a cloudy sky or a sunny one. Chill is common. Reach home at around 7:30 PM... take a 30 mins refresh time out... peep into kitchen to check what roommates (if any have arrived) are doing and with corporate social responsibility lend a helping hand to them. Dinner at 9:00 PM.. chats.. phone calls.. occassional movies.. to deep deep sleep at 10:30 or 11:00 or 12:00 in the warm warm room :).


But still...


I move along in shadows of night
with star light passing through
a hole in my chest
in the shape of a heart.

The image in the pool fades away
as my destiny written on a paper
dancing to the music of Spheres,
flutters in the night's cold winds.


The End of A Day

Saturday, April 10, 2010

నిదుర రాని ఈ నిశీధం

నగరాలు దేశాలు దాటాను,
మిత్రులను శత్రువులను వదిలి,
ఉన్న ఊరిని, కన్నా వారిని వదిలి,
ఈ seattle ఊరిలో పడ్డాను.

ఆదరా బాదరా ఏర్పాట్లు,
ఆఖరి నిమిషపు గ్రహపాట్లు,
కోల్పోయిన ipodu,
పర్లేదులే అని నాన్న కబుర్లు.

"మళ్లీ ఒక్కసారి చూడాలి"
అన్న అమ్మ మాటలు!
గుండెల్లో గూడు కట్టుకున్న
బాధల మూటలు!

కంటి నుండి జారిన
కన్నీటి చుక్క
సెలవింకా మీకందరికీ
అని మూగగా చెప్పిన లెక్క.

మాట పెగలనివ్వని  గొంతులో  నొప్పి,
కన్నీరు కూడా తీర్చలేని దప్పి
దూరపు కొండలు నునుపు
కాని వాటి వెంటే పరుగు.

మరుపు లేని ఈ పాట్లు,
కంటి చివర రాలని చుక్కలట్లు,
airport కి చేరితే కాని
జారని ఉత్సుకపు కట్లు.

గాలి లోనే కొట్టిన విమానపు చక్కర్లు
తిప్పిన లండన్ ఊర్లు,
ఇంటికి చేసిన call 5 పౌండ్లు,
all  the best అని  FB లో  మేస్సేజులు.

చెంబు లేని దేశం లో
tissue పెద్ద  issue
అనుభవం ఐతే కాని
తెలియదు ఆ  డిషుం డిషుం!

అలవాటులేని పని, ఏ దారిలోకి వెళ్తుందో?
కాదా ఇది శిక్ష?
బుర్ర నమ్ముకొని వచ్చిన వాడికి
ఆ ఆంజనేయుడే రక్షా!

ఏ జన్మ ప్రారబ్దమో,
ఏ పాప ఫలమో,
పొట్ట కూటి కోసం ప్రయాణం
seattle నగరం లో నిదుర రాని ఈ నిశీధం.

Tuesday, March 30, 2010

వంశీ కతలు - భూతాలంటే భయం పోయింది

చిన్నప్పుడు నాకు చీకటి అంటే చాలా భయం. ఇంచుమించు కాలేజీ కి వెళ్ళే వయస్సు వరకు ఆ భయం ఉండేది. ఐతే భయం దేనికంటే చీకటి లో ఏవో తెలీయని భయానక జీవులు, భూతాలూ, దెయ్యాలు ఉంటాయి అని. జీ హర్రోర్ షో పుణ్యమా అని ఈ భయం పెరిగింది. పెరుగుట విరుగుట కొరకే అని సామెత. మరి నాకు భూతాలంటే భయం ఎలా పోయింది?

పూర్ణమ్మ తన జీవితం లో చాలా ఆటుపోటులు తిని రాటుదేలి పోయిన మనిషి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు పుట్టిన తరవాత, ఆ పెద్ద కుటుంబాన్ని దిక్కు లేనిది గా చేసి వెళ్ళిపోయాడు ఆ పెనిమిటి. గొప్పింటి కోడలు గా ఉండాల్సిన ఆమె దాయాదుల వాళ్ళ ఆస్తి పోగొట్టుకొని వీధిన పడింది. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి విశాఖపట్నం చేరి,  పెళ్ళిళ్ళలో వంటలు చేసే పనిలో దూరింది. అప్పటికి ఇంకా కేటరింగ్ పోరు మొదలు అవ్వలేదు వంట వాళ్లకి. పెద్ద పెద్ద వాల్లిల్లలో పెల్లిలకి వంట వాళ్ళని పిలిపించుకొని వంటలు చేయించుకోవటం, కార్యక్రమాలు అయ్యినంత వరకు వారి ఇళ్లలోనే ఉండటం ఉండేది. వంటలలో చెయ్యితిరిగిన మనిషి కావటం తో పూర్ణమ్మ కి పెళ్లి పిలుపులు బాగానే వచ్చేవి. పెళ్ళిళ్ళ సీజన్లో అయిపోయినా ఉన్న కాసింత డబ్బు తో సాగిపోయేది ఇల్లు. అలానే పిల్లలని చదివించింది. అందరు పిల్లల కన్నా చిన్న వాడు రామం అంటే చాలా ప్రేమ ఆ తల్లి కి. ఆ ప్రేమ వల్లనేమో వాడికి చదువు అబ్బలేదు, అపారామైన తెలివి తేటలు. చదువులలో సున్నా. పది దాటటానికి మూడేళ్ళు పట్టింది.

పూర్ణమ్మ కి వయస్సు మీదకి రావటం తో చూపు తగ్గింది. కేటరింగ్ కొత్త వింతలూ రావటం తో పాత వంట రోత అయ్యింది జనాలకి. రామం తప్ప కొడుకులు అందరు మంచి ఉద్యోగాల్లో స్తిరపడ్డారు వారి సంసారాలతో. కూతుర్లకి కూడా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది. ఎవరికి వారు జీవితాలలో busy అయ్యారు. అమ్మని మర్చి పోయారు.
మిగిలిన డబ్బు, కొడుకు రామం తో తను కొనుకున్న ఊరు చివరి పెంకుటింటి కి మారింది పూర్ణమ్మ. రామం కి వయస్సు తో బాటే వ్యసనాలు ఎక్కువయ్యాయి. వాటికి డబ్బులు అమ్మ నుండి రాక పోవటం తో ఒక రోజు  దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ లో ఉద్యోగం సంపాదించుకొని వచ్చాడు. పూర్ణమ్మ కూడా కొడుకు ప్రయోజుకుడు కావటం తో కొంచం కుదుట పడింది. తీర్థయాత్రలకి బయలేదేరి  సంపూర్ణ భారత దేశ యాత్ర ముగించింది.ఇల్లు అమ్మి తన దగ్గరకి వచ్చేయ్యమన్న  పెద్ద కొడుకు ని, చిన్న కూతురుని  కాదని, తన ఆఖరి కొడుకు బాగోగులు చూసుకోవటం కోసం వాడి దగ్గరే ఉంది పోయింది.

Monday, March 29, 2010

Delightful ambiguity. Really..??

Not knowing what is going to happen the next moment is one of the best parts of life. We are actors in a play where each moment is randomly churned out. There might be a remote possibility at random that we can predict what the next random event is going to be. But the infiniteness randomness doesn't really make it any better.


Am I going to pass? Will she accept? Will I get the job?  Will my dad buy me a bike? Will I win the lottery? What number does the dice roll next? Ambiguous situations. 
Some of these fall into the category called 'delightful ambiguity'. If you continue to be in this blissful state too long it  will place you right in the middle of a state where more than 90% of the world is already in. Confusion. Ambiguity. There is no delight in that.

Saturday, March 27, 2010

Something Made of Glass



The fan beside the mattress is trying hard to blow the hot air out of the room, sounding like a beehive. The books lying around the mattress are carelessly left open, with their pages turning rapidly and randomly, like the time that is passing by. Rapid days. Random Thoughts. Shirts and trousers are hanging at a corner of that room, which is filled with the smell of deodorant and room freshener.

It was six on that dawn when he woke up with a feeling of something made of glass broken within in him. He could feel those broken glass pieces getting pumped all over his body through his veins, broken glass in the tub filled with water, broken mirror in the bathroom, glass bits in his morning dose of caffeine and he knew he had twenty four hours to live. Human brain at times does things like love, which go beyond reasoning.

He worked harder than usual throughout the day, though the world around him started growing distant and he forgot about that morning’s feeling altogether. He came into the room the crumpled white cotton shirt sticking to his body sweat. The helmet dropped dead onto a chair from his hand, followed by his wallet, keys, phone – and few other things which were once valuable, but now seemed worthless.

He dropped down on the mattress, picked up a book – a random pick whose last words read ' ... races condemned to a hundred years of solitude did not have a second opportunity on earth.'

Broken mirror and tub filled with glass pieces brought back some memory which slid through his throat like a green, bitter liquid. He sat down on the mattress, trying to gulp down that memory which hurt as it slid passing the cuts the broken pieces have made. As he entered that room filled with the smell of deodorant and room spray, clothes hanging in a corner, where the fan was buzzing like fly in the ear and books fluttering around and picking up a book about a hundred years of solitude, the thought came back that he had less than twenty four hours to live and that the glass bits never stopped cruising through his body.

He felt he was born as a 25 years old person, though the photo frames hanging on the wall showed him as a child playing on a beach. He barely remembered his childhood now. The weight of twenty-five years of thoughts and memories suddenly came onto him. There were sparkles in his eyes one moment and tears in the other, smile on his face one moment and heavy sadness the next.

Seconds ticked away to minutes and minutes to hours. He sat still with his body covered with filmy sweat. Not a muscle twitched nor a vein throbbed and on his face a void expression appeared. He suddenly felt as light as air. A thin transparent yet obstructing film appeared between his vision and the rest of the world around him. He moved away from a body on whose face was a void expression, away from the mattress, the fan, broken mirror and tub with water which still had broken glass pieces.

As the painfully throbbing stars began to disappear from the sky one by one, a bright star appeared at the horizon just for a moment and disappeared. A lone bird sang a soulful tune as the Sun rose.  Somewhere, sometime, in another realm he was born again with something made of glass within him. May be the strength of his past life will give him strength to bear if it breaks again.

[Or]

Somewhere, sometime, in another realm he might have born with something made of glass within him, only to have it broken after twenty five years.
Sweet Hope, ethereal balm upon me shed,
And wave thy silver pinions o’er my head.
To Hope, Keats

వంశీ కతలు - పరుగులు

చాలా హడావిడిగా పరిగెడుతున్న రవి ని ఆగమని ఒక పోలి కేక పెట్టాడు మోహన్, తనని చూసే పారిపోతున్నాడు అని తెలీక. అయినా ఆగని రవి ని పట్టుకోవాలి అని పరుగు మొదలు పెట్టాడు మోహన్. అలా పరుగెడుతూ, నిద్ర పోతున్న బుజ్జి గజ్జి కుక్క తోక ని మట్టేసారు ఇద్దరు. ఒకడి వెనకాతల ఒకడు తోక మట్టటం తో కుయ్యో మొర్రో అంటూ ఆ కుక్క వీళ్ళ ఇద్దరి వెనకాతల పడింది. ముందు రవి, వెనక మోహన్, వీళ్ళిద్దరి వెంట గజ్జి కుక్క. డాబా మీద నుండి చూస్తున్న స్వప్న కి ఈ పరుగులు చూసి నవ్వు ఆగలేదు. ఆ కుక్క ఒకప్పుడు స్వప్న వాళ్ళ పెంపుడు కుక్క. వీళ్ళు పెట్టిన తిండి తినే అలా అయిపొయింది అని కాలనీ లో అందరు అనుకుంటారు. కాదు బొచ్చు కుక్కని కొనమంటే, స్వప్న నాన్న గజ్జి కుక్కని కొన్నాడు అన్న నిజం అందరికి తెలిసిన రహస్యం. అయినా అది వేరే విషయం.

ఆ పరుగు పందెం వీధి దాటిపోయి గతుకుల మెయిన్ రోడ్డు మీద కి చేరింది. కుంటుతూ పరుగెడుతున్న గజ్జి కుక్క ని చూసి, జాలి పది సోదర భావం తో మెయిన్ రోడ్ కుక్కలు కూడా పరుగు మొదలు పెట్టాయి, రవి మోహన్ ల వెంట.
రవి  తన పక్కనుండి వెళ్తున్న సిటీ బస్సు ఫుట్ బోర్డు ఎక్కి వెనక్కి తిరిగి చూసాడు, కుక్కలా తన వెంట పడ్డ మోహన్, ఆ వెనకాల కుక్కలా గుంపుని చూసి నవ్వుకొని బస్సు లో ఖాళి సీట్ చూసి కూర్చున్నాడు.

అలా రన్నింగ్ లో బస్సు ఎక్కక పొతే ఇంకో బస్సు లో రావచ్చు కదా అన్నాడు తన పక్కనే  కిటికీ సీట్లో కూర్చున్న స్వప్న వాళ్ళ నాన్న. 'నిజం చెప్పమంటారా, అబద్దం చెప్పమంటారా అంకుల్' అన్నాడు రవి, పాతాల భైరవి లో NTR ఫోసులో. 'ఏదో ఒకటి చెప్పు' అన్నాడు స్వప్న నాన్న, నేపాల మాంత్రికుడి లా గెడ్డం గోక్కుంటూ, బయట పోస్టర్ మీద అనుష్క పోస్టర్ చూస్తూ.

 'మోహన్ మీ అమ్మాయి కి ఇవ్వమని లవ్ లెటర్ నాకు ఇస్తున్నాడు. వాడి నుండి తప్పించుకోవటానికి ఇలా పరుగెత్తా' అని తాపిగా చెప్పాడు రవి. ఉలుక్కు పడ్డ గెడ్డం మాంత్రికుడు కిటికీ లోనుండి బయటకి చూసాడు మోహన్ కనిపిస్తే దొబ్బులు పెడదామని.  కాని అప్పటికే మోహన్ పరుగు ఆపెయ్యడం, కుక్క గ్యాంగ్ లో ఒక కుక్క వాడి పిక్క ముక్క లాగేయ్యటం కూడా ఐపోయింది. ' బాబు, తల లోపలి పెట్టండి సర్' అన్నాడు కోపంగా బస్సు  డ్రైవర్.
తరవాతి స్టాప్ లో RTC Squad వస్తే ticket లేని రవి బతుకు జీవుడా అని దిగి, mobile కోర్ట్ కి వెళ్లి ౧౦౦ రూపాయలు ఫైన్ కట్టాడు రవి, స్వప్న తనకి రాసిన లవ్ లెటర్ జేబులో తడుము కుంటూ...

కుక్క కరిచిన తనని స్వప్న వాళ్ళ నానా ఎందుకు కొట్టాడో, మోహన్ కి అర్థం కాలేదు. గజ్జి కుక్క మరి ఇంకా ఆ వీధి లో కనిపించలేదు. నేపాల మాంత్రికుడు మాత్రం ఇప్పటికి తను కొన్నది గజ్జి కుక్క కాదు, బొచ్చు కుక్కే అని వాదిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు తన అల్లుడైన రవి తో. ఐతే ఒక ప్రశ్న మాత్రం ఇంకా ఉండిపోయింది. రవి ఆ రోజు ఎందుకు పరుగెత్తాడు? :-)

గమనిక: అచ్చుతప్పులని తన్నించ ప్రార్థన.

Friday, March 26, 2010

అప్పుడే భగవద్గీత ఎందుకు!!

"నీకు అప్పుడే భగవద్గీత ఎందుకు!"

భగవద్గీత చెప్పినది వయస్సు మళ్ళిన ముసలి వాడికా? యుద్ధానికి వెళ్తున్న వీరడికా?
కర్తవ్యం మర్చి పోయిన అర్జునుడికి చేసిన జ్ఞాన బోధ కాదా గీత? మరి ఎందుకు మనకి ఈ నిర్లక్ష్యం? ఎందుకంటే సమాజం అలా తయారు చేసింది గీత ని. కాలేజీ కి వెళ్ళే కుర్రాడు భగవద్గీత చదువుతుంటే ఇంట్లో తల్లి తండ్రులే వాడిని ఆక్షేపిస్తారు. 'నీకెందుకురా ఇప్పుడు నుండి?' అని. వాడికి కాకపొతే 'All is well with the world' అనుకుంటూ పడకకుర్చి లో కూర్చొని రోజంతా పేపర్ చదువుకునే వాళ్లకి కాలక్షేపమా ఈ గీత? ఎన్నటికి కాదు.

తను ఏమి చెయ్యాలో తెలీక, తికమక పడుతూ, చేసే పని వలన వచ్చే ఫలితం కోసం ఆలోచించే వాడికి, 'చంపడానికి నువ్వెవరు, చావటానికి వాళ్ళెవరు. అంతా నేనే! నిమిత్త మాత్రం భవ సవ్యసాచిం|.

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫల హేతుర్భు: మా తే సంగోస్త్వకర్మణి   ||"

నువ్వు చెయ్యాల్సినది ఏదో నువ్వు చెయ్యు, దానిని దాటి వెళ్లకు. నువ్వు ఆ పని యొక్క ఫలితం కి కారణం కాదు. ఆ చేసే పని వళ్ళ వచ్చే ఫలితం నాకు వదిలేయ్. That result should not lead you towards inaction or omission of your duties.

ఇంత కన్నా మించిన దిక్సూచి ఉంటుందా ఈ నాటి యువతరానికి?  కాలేజీ వదిలి బయట ప్రపంచాన్ని ఎదుర్కొనే ప్రతీ యువకుడు, యువతి అర్జునులు కాదా? మరి ఎవరు చెప్తారు వాళ్లకి ఈనాటి భగవత్గీత?
 
This should begin at home. Inculcate the Indian philosophical thoughts from childhood. If you think your child is too young and should rather spend time on cartoons, remember that Sri Adi Sankara was 8 years old when he was given a dried gooseberry as bhiksha. Introduce kids to Gita, Upanishads. Tell them how vast the Hindu philosophy is. Explain them the dilemma of Arjuna, his resistance to do what his duty needs him to do. Tell them how Krishna cleared his doubts not by mere materialistic comparison but by exploration of upanishad saara. Teach the karma yoga of Gita. 

Gita was not taught to Bheeshma. It was taught to Arjuna, a warrior who was hesitant to play his role in the battle. Isn't that Arjuna in every kid who is getting ready to face the war of life?

చివరగా పిల్లలకి, యువతీ యువకులకి ఒక్క మాట - "ఉద్దరేత్ ఆత్మన్ ఆత్మానౌ! " నిన్ను నువ్వే ఉద్దరించుకో! It is in your hands to mould yourself to be the best version of you. Do not wander too far away from that path of being that version. Explore. Think. Question. Learn. Explore. 

Vamsi
Jai Sri Ram

Delusion - I

In Search Of Ishaan Awasthi

 A sunrise.  Dew on the grass. Birds chirping and distant sound of temple bells.  A fresh shower of rain after scorching heats of summer. Smell of damp earth. Warmth coming out of the ground.  Flight of a butterfly. Colors of a rainbow. A silent evening walk on a beach. Chat in a park.

Go ahead! Call me a romantic fool!

These are things that we were in touch with until a good five years ago. These are the things that inspired us in one way or the other, for one thing or another, to do something which wanted to do.  We were game for everything , every challenge and every sport. Be it painting competition on Independence Day  or fancy dress for Teacher’s Day or great debates across different sections, groups &  departments or a skit for a Fresher’s Day in college or happy-to-have fights in college. Name it, and I am sure that we have participated in one or more of the activities that are listed and not listed above.  Surely, the Sports day marches have inculcated whatever discipline is left within us today.

Thursday, February 4, 2010

Pigeon

Shot this one in Jaipur palace...
Somehow liked the way it caught on to the design.

Monday, January 4, 2010

'A teardrop on the cheek of eternity' - Tagore

'A fool's gift for his dead love! An everlasting symbol of otherwise volatile love' - Vamsi


Photography - Vamsi