Tuesday, August 10, 2010

నాలో నేను

ఎవరి హడావిడిలో వాళ్ళు,
నా తీరిక లో నేను.

ఎవరి బాధల్లో వాళ్ళు
నా ఆనందం లో నేను.

ఎవరి ఆలోచనల్లో వాళ్ళు
అస్సలు ఆలోచన లేని నేను!

నాతో నేను ఓడిపోయి
నాలో నేను గెలిచి
నాలో నేను రగిలి
నా నీడ తోనే అలిగి,
పగిలి,
నాలో నేను
కేవలం నేను గానే మిగిలి...

1 comment:

james said...

"నాలో నేను
కేవలం నేను గానే మిగిలి..."

శుభం...ఎట్టకేలకు సూక్ష్మం గ్రహించావు :)