Thursday, January 20, 2011

త్వం


ఆకాసాన హరివిల్లుపై
వయ్యారి మెరుపువై!
తీగచాటు మొగ్గపై
విరిసిన మంచుపువ్వువై!

నా మది పై
వేసిన ఊహిల పందిరివై!
నీలాల కడలి అలవై
కనురెప్ప మాటు కలవై!

నా మనస్సువు నీవై
నా ఉషస్సు నీవై...
నాలో సగమై
ఓదార్చు మలయమారుత్తువై!

క్రిష్ణ శాస్త్రి ఊర్వశి లా
నండూరి వారి ఎంకి లా
కలగానె ఉండిపొతావొ
కళనే మరిపిస్తావో

అహం



కనిపించని నఖక్షతాలు
పొడిబారిన తడి పెదవులు
మగతగా సుదూర సురభిళం
చల్లగా తగిలిన వెచ్చని స్పర్శ.


కల్లలైన కలలను చూసే కనులకు
ఏమి చెప్పి సముదాయించాను?
చల్లగా నిద్రలోకి వచ్చిన అతిథిని
మెలుకువ లో ఎలా కలువను?

ఏదారిలో వీడానో ప్రేయసి ని
కలల దారిలో ఎలా మరువను?
ప్రశ్న విన్న చంద్రుడు 'తెల్లారింది'
అంటూ మబ్బుల్లో మాయమయ్యాడు

అశ్రుత్వ గాంధర్వం కోసం
అలిఖిత చిత్రం కోసం...