Saturday, April 10, 2010

నిదుర రాని ఈ నిశీధం

నగరాలు దేశాలు దాటాను,
మిత్రులను శత్రువులను వదిలి,
ఉన్న ఊరిని, కన్నా వారిని వదిలి,
ఈ seattle ఊరిలో పడ్డాను.

ఆదరా బాదరా ఏర్పాట్లు,
ఆఖరి నిమిషపు గ్రహపాట్లు,
కోల్పోయిన ipodu,
పర్లేదులే అని నాన్న కబుర్లు.

"మళ్లీ ఒక్కసారి చూడాలి"
అన్న అమ్మ మాటలు!
గుండెల్లో గూడు కట్టుకున్న
బాధల మూటలు!

కంటి నుండి జారిన
కన్నీటి చుక్క
సెలవింకా మీకందరికీ
అని మూగగా చెప్పిన లెక్క.

మాట పెగలనివ్వని  గొంతులో  నొప్పి,
కన్నీరు కూడా తీర్చలేని దప్పి
దూరపు కొండలు నునుపు
కాని వాటి వెంటే పరుగు.

మరుపు లేని ఈ పాట్లు,
కంటి చివర రాలని చుక్కలట్లు,
airport కి చేరితే కాని
జారని ఉత్సుకపు కట్లు.

గాలి లోనే కొట్టిన విమానపు చక్కర్లు
తిప్పిన లండన్ ఊర్లు,
ఇంటికి చేసిన call 5 పౌండ్లు,
all  the best అని  FB లో  మేస్సేజులు.

చెంబు లేని దేశం లో
tissue పెద్ద  issue
అనుభవం ఐతే కాని
తెలియదు ఆ  డిషుం డిషుం!

అలవాటులేని పని, ఏ దారిలోకి వెళ్తుందో?
కాదా ఇది శిక్ష?
బుర్ర నమ్ముకొని వచ్చిన వాడికి
ఆ ఆంజనేయుడే రక్షా!

ఏ జన్మ ప్రారబ్దమో,
ఏ పాప ఫలమో,
పొట్ట కూటి కోసం ప్రయాణం
seattle నగరం లో నిదుర రాని ఈ నిశీధం.

1 comment:

Rajugaru said...

పొట్ట 'కూటి' కోసం
ఉన్న 'గూటి'ని 🇮🇳 వదులుతున్న సందర్భం..!! 😢

విమానం లో కాలు పెట్టేక గాని తెలియలేదు, ఇది *నన్ను కాలం తో పాటు - ముక్తి నుండి కూడా వెనక్కి విసిరేస్తుంది* అని

🙏🏻