Friday, March 26, 2010

అప్పుడే భగవద్గీత ఎందుకు!!

"నీకు అప్పుడే భగవద్గీత ఎందుకు!"

భగవద్గీత చెప్పినది వయస్సు మళ్ళిన ముసలి వాడికా? యుద్ధానికి వెళ్తున్న వీరడికా?
కర్తవ్యం మర్చి పోయిన అర్జునుడికి చేసిన జ్ఞాన బోధ కాదా గీత? మరి ఎందుకు మనకి ఈ నిర్లక్ష్యం? ఎందుకంటే సమాజం అలా తయారు చేసింది గీత ని. కాలేజీ కి వెళ్ళే కుర్రాడు భగవద్గీత చదువుతుంటే ఇంట్లో తల్లి తండ్రులే వాడిని ఆక్షేపిస్తారు. 'నీకెందుకురా ఇప్పుడు నుండి?' అని. వాడికి కాకపొతే 'All is well with the world' అనుకుంటూ పడకకుర్చి లో కూర్చొని రోజంతా పేపర్ చదువుకునే వాళ్లకి కాలక్షేపమా ఈ గీత? ఎన్నటికి కాదు.

తను ఏమి చెయ్యాలో తెలీక, తికమక పడుతూ, చేసే పని వలన వచ్చే ఫలితం కోసం ఆలోచించే వాడికి, 'చంపడానికి నువ్వెవరు, చావటానికి వాళ్ళెవరు. అంతా నేనే! నిమిత్త మాత్రం భవ సవ్యసాచిం|.

"కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫల హేతుర్భు: మా తే సంగోస్త్వకర్మణి   ||"

నువ్వు చెయ్యాల్సినది ఏదో నువ్వు చెయ్యు, దానిని దాటి వెళ్లకు. నువ్వు ఆ పని యొక్క ఫలితం కి కారణం కాదు. ఆ చేసే పని వళ్ళ వచ్చే ఫలితం నాకు వదిలేయ్. That result should not lead you towards inaction or omission of your duties.

ఇంత కన్నా మించిన దిక్సూచి ఉంటుందా ఈ నాటి యువతరానికి?  కాలేజీ వదిలి బయట ప్రపంచాన్ని ఎదుర్కొనే ప్రతీ యువకుడు, యువతి అర్జునులు కాదా? మరి ఎవరు చెప్తారు వాళ్లకి ఈనాటి భగవత్గీత?
 
This should begin at home. Inculcate the Indian philosophical thoughts from childhood. If you think your child is too young and should rather spend time on cartoons, remember that Sri Adi Sankara was 8 years old when he was given a dried gooseberry as bhiksha. Introduce kids to Gita, Upanishads. Tell them how vast the Hindu philosophy is. Explain them the dilemma of Arjuna, his resistance to do what his duty needs him to do. Tell them how Krishna cleared his doubts not by mere materialistic comparison but by exploration of upanishad saara. Teach the karma yoga of Gita. 

Gita was not taught to Bheeshma. It was taught to Arjuna, a warrior who was hesitant to play his role in the battle. Isn't that Arjuna in every kid who is getting ready to face the war of life?

చివరగా పిల్లలకి, యువతీ యువకులకి ఒక్క మాట - "ఉద్దరేత్ ఆత్మన్ ఆత్మానౌ! " నిన్ను నువ్వే ఉద్దరించుకో! It is in your hands to mould yourself to be the best version of you. Do not wander too far away from that path of being that version. Explore. Think. Question. Learn. Explore. 

Vamsi
Jai Sri Ram

No comments: