చిర్రు మనే ఎండలు
వెలిగిపోయే మామిడి పూతలు
కొమ్మల్లో కోకిల కూతలు
ఆగామి వాసంత వీచికలు.
తోటలో కొట్టుకు తెచ్చిన
మామిడి పిందెలు
కోమటి కొట్లో నుండి
కొత్త చింతపండు, బెల్లాలు.
ఉగాది పచ్చడి లో వస్తువులు.
రామాలయంలో పంచాంగ శ్రవణం
అమ్మవారి జాతర సంబరం
అది వసంత నవ రాత్ర ఆరంభం
ఒక కలగా మిగిలిన
చిన్నప్పటి ఉగాది వేడుకల చిహ్నం.
నాన్న దండన ఉండదు
చెల్లి అల్లరి కనిపించదు
పుష్పసురభిలం లేదు
ఉగాది శోభ అనిపించదు
ఈ వాసంతం రుచించదు!
నోటుల వేటలో, మాటల కోటలు కట్టుకుంటూ
కాగితం పూలలో వసంత శోభ ని వెతుక్కుంటూ
హృదయగహ్వారాలని బంధించి
ఎగశ్వాసతో ఈ అంతులేని పరుగు లో
మొదటి స్థానపు ఎండమావి కై పోటి పడుతున్నాం!
ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు
మనల్ని, మనవాళ్ళని, మళ్లీ గుర్తుతెచ్చుకుందాం
మన మూలాలని ఒక్కసారి వెతుక్కుందాం
జీవితాన్ని వేటితోనో కొలవటం ఆపి, ఆస్వాదిద్దాం!
వచ్చు కాలం మేలు పోవు కాలం కంటే అని కోరుకుందాం.
నవ తరానికి దీపస్తంభాలుగా నిలుచుందాం
రేపటి తరానికి సాంస్కృతిక బాట ని వేద్దాం!
నేడు వచ్చిన ఈ వత్సరాన్ని
గుండె తలుపులు తీసి ఆహ్వానిద్దాం
ఈ 'ఖర' నామ ఉగాది అందరికి
శ్రీకరంగా ఉండాలి అని కోరుకుందాం!
లోకాః సమస్తాన్ సుఖినోభవంతు అంటూ
ఈ ఉగాదిని 'నవ' ఉగాది గా మార్చుకొని
నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందాం!
వెలిగిపోయే మామిడి పూతలు
కొమ్మల్లో కోకిల కూతలు
ఆగామి వాసంత వీచికలు.
ఏరుకొని వచ్చిన
వేప పువ్వులుతోటలో కొట్టుకు తెచ్చిన
మామిడి పిందెలు
కోమటి కొట్లో నుండి
కొత్త చింతపండు, బెల్లాలు.
ఉగాది పచ్చడి లో వస్తువులు.
ఉదయాన్నే తలంటి స్నానం
అమ్మ చేసే పచ్చడి తినడంరామాలయంలో పంచాంగ శ్రవణం
అమ్మవారి జాతర సంబరం
అది వసంత నవ రాత్ర ఆరంభం
ఒక కలగా మిగిలిన
చిన్నప్పటి ఉగాది వేడుకల చిహ్నం.
దేశం కాని దేశం లో
అమ్మ పిలుపు వినిపించదునాన్న దండన ఉండదు
చెల్లి అల్లరి కనిపించదు
పుష్పసురభిలం లేదు
ఉగాది శోభ అనిపించదు
ఈ వాసంతం రుచించదు!
ఈ బతుకు పరుగులో పడి
ఉగాది అయినా, ఏ ఆది అయినా, ఒకేలా జీవిస్తూ నోటుల వేటలో, మాటల కోటలు కట్టుకుంటూ
కాగితం పూలలో వసంత శోభ ని వెతుక్కుంటూ
హృదయగహ్వారాలని బంధించి
ఎగశ్వాసతో ఈ అంతులేని పరుగు లో
మొదటి స్థానపు ఎండమావి కై పోటి పడుతున్నాం!
అందుకే ఒక్క నిమిషం ఆగుదాం!
ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు
మనల్ని, మనవాళ్ళని, మళ్లీ గుర్తుతెచ్చుకుందాం
మన మూలాలని ఒక్కసారి వెతుక్కుందాం
జీవితాన్ని వేటితోనో కొలవటం ఆపి, ఆస్వాదిద్దాం!
వచ్చు కాలం మేలు పోవు కాలం కంటే అని కోరుకుందాం.
నవ తరానికి దీపస్తంభాలుగా నిలుచుందాం
రేపటి తరానికి సాంస్కృతిక బాట ని వేద్దాం!
నేడు వచ్చిన ఈ వత్సరాన్ని
గుండె తలుపులు తీసి ఆహ్వానిద్దాం
ఈ 'ఖర' నామ ఉగాది అందరికి
శ్రీకరంగా ఉండాలి అని కోరుకుందాం!
లోకాః సమస్తాన్ సుఖినోభవంతు అంటూ
ఈ ఉగాదిని 'నవ' ఉగాది గా మార్చుకొని
నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందాం!
No comments:
Post a Comment