Saturday, March 24, 2018

ఆధునిక మహాభారతం


ఆద్మీ  పర్వం

"వేళ్ళు కాళ్ళయి  నడిచే చెట్టు మనిషి; చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది; మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను.
...
నేను మాత్రం నడుస్తున్నా రిక్తహస్తాలతో నా దేశం కానీ దేశం లో నాకేమీ లేని ప్రదేశం లో నా జ్ఞాపకాలు అనుచరులుగా నా జ్ఞాపకాల ఊరేగింపుకు నేనే నాయకుడ్నిగా "

ఏమిటి ఈ కవి బాధ. శ్రీ శ్రీ ని చదివినప్పుడు అనిపించలేదు ఇలా. అతను అరిచిన అరుపులు, వినిపించచేసిన ఆకలి కేకలు, విదిలించిన ఘర్మ జలాలు, నీడలు, ఘోషలు,  కవితా దీక్షలు -  వీటి తో బానే connect అయ్యాను. చలం అన్నట్టు - 1995-96 లో చదివిన మహా ప్రస్థానం మళ్ళీ 2017 లో కూడా అంటే impressive గా అనిపించింది. In fact, ఇంకొంచం ఎక్కువ గానే.

ఇప్పుడే మొదలు పెట్టాను గుంటూరు శేషేంద్ర శర్మ ని చదవడం - అదీ అతని ఆధునిక మహాభారతం. ఇంకొంచం చదువుతాను, అర్థం చేసుకోగలను ఏమో ఇతని లోని ఈ పార్శ్వాలను!
Parallel గా షోడశీ కూడా చదువుతున్నాను. అదృష్టం కొద్దీ సంస్కృతం  లో సుందరాకాండ చదివే అలవాటు అన్నందువలన, లవలేశం ఆ పాదాల అర్థం తెలియడం వల్ల  I am able to enjoy that book a lot. దాని కోసం అయినా మళ్ళీ సంస్కృతం నేర్చుకోవాలి!

Back to ఆధునిక మహాభారతం.

No comments: