చిటికెడు చిట్కా చేతలు , అంతే తేలని మాటలు
ఉద్యోగ జీవితమా, జీవితమంత ఉద్యోగమా ఇది?
ఈ మలుపుల తలపుల ప్రస్తానం లో
ఆ ఆలోచనకి వెసులు బాటు ఏది?
కొంచం సేద తీరే సమయమేదీ?
చిగురించిన చెట్లని చూసినా
మొలకెత్తిన మొగ్గలు మురిసినా
ప్రభాత సమయాన పక్షులకూతలు విన్నా
హిమంలేని ఉషోదయం విరిసినా
గుర్తుకు రాలేదు ఇది వసంతం అని
అవును మరి మావి చిగురులు కావు ఆ చివురులు
పూసినది వేప పూత కానే కాదు
అస్సలు కోకిల జాడే లేదు
ఉదయ, సాయం సంధ్యల మధ్య భేదమూ లేదు
ఈ రమణక వర్షం లో! ఆధునిక ఉద్యోగ పర్వం లో!
అందుకే మరి గుడి లో సమాచారం చూస్తే కాని
తెలీలేదు ఉగాది రాబోతుంది అని.
కిరాణా కొట్లలో పెట్టిన వస్తువులు చూసి
అనుకున్నాను 'అవును సుమీ ఉగాది వస్తోందా ' అని!
మన వేగినాటి ఉగాది సంబరాల విషయం వింటే కాని
తెలీలేదు రాబోయేది 'జయ' ఉగాది అని.
జయం కోసమే కదా పై ఆరాటం అంతా
ఆ జయం కోసమే కదా అందరి పోరాటం అంతా
చంచల లక్ష్మి కాదు జయం అంటే
ఎడారి లో ఎండమావి కాదు జయం అంటే!
పక్కదారులు పట్టే వారికి దొరికేది కాదు జయం అంటే!
కంటికొనల కలల దీపాలవెలుగు లో
శ్రమించి సాగించే ప్రస్తానం లో
ఒక మజిలీగా దొరుకుతుంది జయం!
తీరాన్ని మరల మరల కొట్టే అలలా
అలుపెరుగక చేసే ప్రయత్నం లో
ఒక బహుమతి గా దొరుకుతుంది ఆ జయం!
రాహువు, కేతువులెదురు పడినా
తలవంచని పున్నమి వెన్నెల వెలుగులా
స్తైర్యం తో సాగితే కలుగుతుంది జయం!
కఠినహిమంత తాపాల పిదప వాసంతం రాక మానదు
విజయుడివై యుద్ధం సాగిస్తే విజయం కలుగక మానదు!
కలగాలి ఈ జయ నామ సంవత్సరం లో -
ధర్మానికి జయం జయం!
న్యాయానికి జయం జయం!
శాంతికి జయం జయం!
శ్రమ కి, శ్రామికుడికి జయం జయం!
జయం దిగ్విజయం!
Ignorance is a bliss and in that blissful ignorance I sent this out to Ravi bava and to my dad for recital in Veginati Sangham's Ugadi celebrations in Vizag. It was then I realized how fool-devilry it was to share this out but the damage has been made. I wanted to make few comments on a couple of lines here - 'చిటికెడు చిట్కా చేతలు , అంతే తేలని మాటలు'. I was referring to my plight of the agility at work and unending meetings. Anyone in software world would understand the pain of meetings :) 'రమణక వర్షం' refers to the country of USA as per the sankalpams I hear in nearby temples. 'విజయుడివై యుద్ధం సాగిస్తే విజయం కలుగక మానదు!' By 'విజయుడివై' I was referring to Arjuna, saying that the fight should be as fierce as Arjuna's fight. Everyone who does labor is a laborer; శ్రమించే వారు ఎవ్వరైనా వారు శ్రామికులే; శారీరిక శ్రమ మాత్రమె కాదు, మానసిక మధనం కూడా శ్రమే.
1 comment:
bagundi :)
its been quite some time that we exchanged these...James is lost somewhere tho...
hope these continue from your end...atleast :)
Post a Comment