ఇది నేను పుట్టకముందే మొదలయిన మార్పు. నాన్నగారు పుట్టకముందే ఏర్పడిన స్థితి. తాతగారి తరంలోనో, వారి నాన్నగారి తరం లోనో మొదలయిన సాంఘిక జీవన కదలిక.
This change is like a slow-moving tar which took some generations to move to its current form.
Majority, minority exist. Exceptions are a norm and are always present. One cannot say that evolution is wrong. It is just a change that organizations, societies, individuals go through as the times change. Widely accepted changes sustain; others go extinct - the changes, individuals, entities, societies. The time and place between sustenance and extinction, is where the judgements are passed, impressions created, and biases established.
తరం 0 - పుట్టిన జాతిలో జీవనం సాగించుట. సాంప్రదాయం కొనసాగించుట.
తరం 1 - క్రొత్తగా వస్తున్న చదువులపై మొగ్గు. తెరుచుకుంటున్న సర్కారీ కొలువులపై ఆశ. పల్లెల నుండి పట్నాలవైపు ప్రయాణం. అనాదిగా వస్తున్న జీవన విధానాలలో 'సంస్కరణ'. తరం 0 అందించిన సాంప్రదాయంలో అవసరానికి తగ్గట్టు చిన్న చిన్న మార్పులు. still sons of the soil.
రెండవ అడుగు -
తరం 2 - పట్నంలో పుట్టినా పల్లెతో కొంత అనుబంధం. తరం 1 చూపించిన విద్యా, ఆదాయ మార్గాలలో ప్రయాణం. తరం 1 అందించిన సాంప్రదాయం చాలా మట్టుకు పాటించినా కూడా కావలసినంత మార్పులు.
తరం 3 - బృహత్ కుటుంబ వ్యవస్త పూర్తిగా atomic కుటుంబాలుగా మారిన తరం. ఆంగ్ల విద్యలు, కొలువులు. పల్లె ఒక విహార స్థలం. వీలుగా ఉన్న సాంప్రదాయాలే తప్ప అన్యమైనవి ఏమీ అవసరం లేదు.
తరం 3.5 - తరం 2, 3 మధ్యలో ఉన్న తరం ఇది. ప్రస్తుతం 'సాంప్రదాయ వాదులు' గా ముద్ర పడే తరం ఇది.
మూడవ అడుగు -
తరం 4 - పక్క పట్నాలకు, అవసరమైతే పక్క రాష్ట్రాలకు విద్యా, వ్యాపార నిమిత్తమై వలసలు. దానికి అనుగుణంగా సాంప్రదాయాలలో మార్పులు. ఎక్కడికైనా వెళ్ళి జీవనం సాగించగలిగే ఆత్మ స్థైర్యం. తరం-2 జీవన విధానం వీరికి చాదస్తం.
తరం 4.5 - రాష్టాలు దాటి ఇతర దేశాలకు జీవన భృతికి ప్రయాణం. స్వభాష అవసరం లేదు. స్వ సాంప్రదాయం అంటే పుస్తకాలలో చదవడమే తప్ప, ఆచరణలో మిడి మిడి జ్ఞానం. అణు కుటుంబాల విచ్చిన్నం - భార్య ఒక చోట, భార్త ఒక చోట, పిల్లలు ఇంకెక్కడో. ఉదర పోషణార్థం బహు కృత వేషం!
నాలుగవ అడుగు -
తరం 5 - పూర్తిగా పరదేశంలో పెరిగిన తరం ఇది. తరం 2 వారు వీరిని పోల్చుకోలేరు. తరం 3 వారికి వీరంటే ఏవగింపు, సాంప్రదాయం పూర్తిగా మర్చిపోయారు అని. సంస్కారం లేదు అని. బయటకి వెళ్తూ దేవుడికి వీలైతే ఒక నమస్కారం పెట్టడం వీరికి పెద్ద సంస్కారం, ముచ్చట పడే సాంప్రదాయం. మాతృభాష వీరికి ఒక అన్య భాష.
తరం 5.5 - పూర్తిగా పరదేశీయులు. కేవలం జన్యురీత్యా భారతీయ సంతతి. అన్య భాష. అన్య దేశ సాంప్రదాయం లో మమేకం. ఏదో సరదాగా అక్కడక్కడ భారతీయ సాంప్రదాయం అది కూడా దాని మూలాలు కానీ, విధానం కానీ తెలియకుండానే. Vinayaka chavithi and Halloween are one and same - both are days to post for SM content.
No comments:
Post a Comment