Thursday, March 22, 2012

ఆ’నందనం’!


కోకిల కుహు కుహూలతో తెల్లారే ఉగాది
Cell phone మోతలతో నిద్ర లేచింది.
సుబ్బులక్ష్మి గారి సుప్రభాతం కాస్తా
టీవీ లో నత్తి anchor ప్రోగ్రాం అయ్యింది.

ఉగాది పచ్చడి తయారీ కి
ఇంటర్నెట్ రెఫెరెన్సు అయ్యింది
క్యాలెండర్ లో ఉగాది 
మరో యెర్ర మార్కు సెలవయ్యింది.

అలాంటి ఉగాది కోసం ఏమి రాయమంటావు బావ? (రవి బావ)
ఈ హిమంతం లో గుర్తుకు వచ్చేవినాటి వాసంత సమీరాలే కావా?

క్రికెట్టు, మహేష్ సినిమా
సినీరాణి ప్రేమ పురాణం
election కి అయ్యిన ఖర్చులు
kolaveri deelu, heartu breakulu
ఇటువంటివి చెప్పు
ఇంకా చూడు నా తడాఖా!

కానీ ఉగాది మీద కవిత అంటే
ఏముంటుంది గతం లేక అబద్దం తప్ప.
మహా ఐతే స్వప్నాల దారాలతో అల్లిన   
ఇలాంటి ఆశల తివాచీ తప్ప.

చందన తాంబూల సత్కారాలు,
చంద్ర శాలలు  అవరసం లేదు కానీ,
ఆనందం కొంచం, కించిత్ బాధ
కాస్త కోపం, మరి కాస్త శాంతం
అక్కడక్కడ భయం, ఇంకొంచెం ధైర్యం
కడుపు నిండా ఆహారం
బ్రతకటానికి కావాల్సిన స్వాత్రంత్రం.
ఇవి చాలు ఈ సంవత్సరం.

ఎటు నుండి చదివినా 
నందనం అయ్యే ఈ సంవత్సరం 
ముసుగులు లేని మనస్సులు 
మహస్సుల్లాంటి మనుషులని ఇస్తుందని కోరుకుందాం.
అలకనంద వంటి స్వచ్చదనం 
నందనందనుడి బృందావనం
ఆనంద సాగర కోలాహలం
నందనం మన జీవితాల్లోకి  తెస్తుందని ఆశిద్దాం!

No comments: